: కీసరలో వడగళ్ల వాన.. హైదరాబాదులో చల్లబడ్డ వాతావరణం
హైదరాబాదు సమీపంలోని కీసరవాసులను అకాల వర్షం పలకరించింది. అంతేకాదు, అక్కడ వడగళ్ళు కూడా పడ్డాయి. దీంతో కీసర వాసులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. కరీంనగర్ జిల్లాలో పెనుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. దీంతో భారీ ఎత్తున మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పిందె దశలోనే మామిడి నేలరాలింది. పొగమంచు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మామిడి దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని భావించిన కరీంనగర్ రైతులను పెనుగాలులు తీవ్ర నిరాశ, ఆందోళనకు గురిచేశాయి. ఈ అకాల వర్షాలతో హైదరాబాదుతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.