: మావోయిస్టులతో సంబంధాల కేసులో.. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొ.సాయిబాబాకు జీవిత ఖైదు
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై తన నివాసంలో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన ఢిల్లీలోని గడ్చిరోలి కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ప్రొ.సాయిబాబాను దోషిగా తేల్చుతూ ఆయనకు జీవితఖైదు విధించింది. సాయిబాబా సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిలో నలుగురికి కూడా జీవితఖైదు విధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. విజయ్ అనే మరో వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసిన తరువాత.. అనారోగ్యం కారణంగా ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసిన తరువాత.. అనారోగ్యం కారణంగా ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.