: ప్రిన్స్ మహేష్ బాబు దగ్గరికి వచ్చి ఆశ్చర్యపరిచిన మెగాస్టార్!


తన తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150', ఆపై మా టీవీలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంతో సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతూ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబుకు స్వీట్ షాకిచ్చారు. అన్నపూర్ణా స్టూడియోలో మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ కొత్త చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండగా, ఆ పక్కనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ జరుగుతోంది. మహేష్ చిత్రం షూటింగ్ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి, కాసేపు అక్కడికి వెళ్లి, మహేష్ పై తీస్తున్న దృశ్యాలను మానిటర్ పై చూస్తూ కాసేపు సెట్లో గడిపారు. మహేష్ పక్కనే మెగాస్టార్, మురుగదాస్ ఉన్న చిత్రాన్ని కెమెరా మెన్ సంతోష్ శివన్ బంధించి, తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News