: 25 ఏళ్ల తరువాత... కలిసి నటించనున్న షారూఖ్, అమీర్!


గడచిన 25 ఏళ్లలో ఎన్నడూ కలిసి నటించని ఖాన్ ద్వయం షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు ఓ వ్యాపార ప్రకటన నిమిత్తం కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. ఓ చానల్ కోసం వీరిద్దరూ కలిసి నటించనున్నారని తెలిసినట్టు 'డీఎన్ఏ' వార్తాసంస్థ ప్రకటించింది. ఈ ప్రకటనలో అమీర్ మిఠాయి దుకాణాన్ని నడుపుతున్న సిక్కు వ్యక్తిగా కనిపిస్తారని, ఇందులో షారూఖ్ కూడా ఉంటారని తెలుస్తోంది. కాగా, 1993 ఆగస్టు 13న విడుదలైన 'పెహలా నషా' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆపై మరే చిత్రంలోనూ వీరు కనిపించలేదన్న సంగతి తెలిసిందే. ఆపై ఇంతకాలానికి కనీసం ప్రకటనలోనైనా కలసి కనిపిస్తారని ఖాన్ ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News