: మెల్లిగా లాక్కొస్తున్నారు... 150 పరుగులు దాటిన లీడ్


బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భారత ఆటగాళ్లు రహానే, పుజారాలు ఆచితూచి ఆడుతుండటంతో మరో వికెట్ కోల్పోకుండా భారత లీడ్ 150 పరుగులు దాటింది. ఈ క్రమంలో రహానే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా సెంచరీకి దగ్గరయ్యాడు. 133 బంతులను ఎదుర్కొన్న రహానే 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేయగా, 219 బంతులను ఎదుర్కొన్న పుజారా ఆరు ఫోర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 238. లంచ్ వరకూ వీరిద్దరూ వికెట్ ను కాపాడుకుంటే, మ్యాచ్ చేజారకుండా చూసుకునే అవకాశాలు అధికమని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News