: అపరిచితుడితో తెలియక సాగించిన ప్రయాణం... రెండు నెలల పాటు ఉన్మాదం!


ఆస్ట్రేలియాను సందర్శించే ఎవరైనా రోడ్ ట్రిప్ వేయాలని అనుకుంటారు. అసలు రోడ్ ట్రిప్ వేసేందుకే ప్రతియేటా దాదాపు ఆరు లక్షల మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. ఇక అదే కోరికతో వచ్చిన ఓ బ్రిటన్ యువతి, అపరిచితుడితో దేశాన్ని చుట్టి వచ్చేందుకు వెళ్లగా, అతను నరకం చూపించాడు. ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, 22 ఏళ్ల బ్రిటన్ యువతి ఆస్ట్రేలియాకు వెళ్లగా, ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతని గురించి ఏమీ తెలియకుండానే, నమ్మి రోడ్ ట్రిప్ కు బయలుదేరింది. అదే ఆమె పాలిట శాపం కాగా, ఆమెను బంధించిన అతడు, పలుమార్లు అత్యాచారం చేశాడు.

సిగరెట్లతో కాలుస్తూ, విపరీతంగా కొట్టి, కత్తులతో కోసి తన ఉన్మాదాన్ని బయటపెట్టాడు. జనవరి 2 నుంచి ఈ దారుణం కొనసాగింది. ఈ నెల 6వ తేదీన సోమవారం నాడు, ఆమెను మరో చోటికి తీసుకువెళుతున్న వేళ, దారిలో పోలీసులను చూసి, తాను వెనుక దాక్కుంటానని, కారును నడిపించాలని బెదిరించాడు. ఆమె ముఖంపై ఉన్న గాయాలను గమనించిన పోలీసులు, బాధితురాలిని కారు దించి, వెనకున్న యువకుడిని అరెస్ట్ చేయడంతో మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చింది. అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశామని, రిమాండుకు తరలించామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News