: షాపింగ్, తినడం, పడుకోవడం ఇష్టం...జిం అంటే బద్ధకం!: అను ఇమ్మాన్యుయేల్
తనకు సినిమాలు చూడడమంటే బాగా ఇష్టమని వర్ధమాన నటి అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. 'కిట్టుగాడున్నాడు జాగ్రత్త' సినిమా ప్రమోషన్ సందర్భంగా తన హాబీస్ గురించి అను మాట్లాడుతూ, తనకు షాపింగ్ అంటే ఇంకా ఇష్టమని చెప్పింది. షాపింగ్ చేయడంలో ఉండే మజా వేరని తెలిపింది. ఆన్ లైన్ అయినా, విండో అయినా, సరదాగా షాపింగ్ అయినా... ఎలా చేసినా షాపింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పింది. షాపింగ్ తరువాత హాయిగా నిద్రపోవడం ఇంకా ఇష్టమని వెల్లడించింది.
బాగా తినడం కూడా ఇష్టమేనని తెలిపింది. నచ్చినంత ఫుడ్డు హాయిగా తినేస్తానని, తిండి విషయంలో హద్దులు పెట్టుకోవడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. జిమ్ అంటే బద్ధకమేనని తెలిపింది. అయితే ఈ ఫీల్డ్ లో గ్లామర్ గా, ఫిట్ గా ఉండడం చాలా అవసరం కనుక జిమ్ ముఖ్యమని చెప్పింది. జిమ్ లో కూడా కాస్త సమయం గడుపుతానని తెలిపింది.