: నెక్స్ట్ లీక్స్ ప్రియమణివే....ఫోటోలా? వీడియోలా?.. జోరుగా ఊహాగానాలు!
సింగర్ సుచిత్రా లీక్స్ దక్షణాది సినీ పరిశ్రమను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హింసించాడంటూ మొదలైన సుచిత్రా లీక్స్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రానా, త్రిష; ధనుష్, త్రిషల కిస్సింగ్ ఫొటోలు, అనిరుధ్ తో ఆండ్రియా, హన్సిక ఎవరితోనో సన్నిహితంగా ఉన్న ఫోటో, సంచిత శెట్టి నగ్న వీడియో.. ఇలా చాలా ఫోటోలు విడుదలయ్యాయి. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన మరో ట్వీట్ తెలుగు, తమిళ, మలయాళ చిత్రపరిశ్రమలో పెను సంచలనం రేపుతోంది.
ఈ ట్వీట్ లో సినీ నటి ప్రియమణికి సంబంధించిన వ్యవహారాలు వెల్లడిస్తామని ప్రకటించారు. దీంతో జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణితో సన్నిహితంగా ఉన్న సినీ ప్రముఖుల గుండెల్లో గుబులు రేగుతోంది. మరోవైపు అభిమానుల్లో ఈసారి ప్రియమణి ఫోటోలు విడుదల చేస్తారా? వీడియో విడుదల చేస్తారా? అంటూ చర్చనడుస్తోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో మాత్రం ఈ ట్వీట్ కలకలం రేపుతోంది.
కాగా, రహస్య ఫోటోలు విడుదలైన అనంతరం తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని తెలిపిన సుచిత్ర, ప్రైవసీ లాక్ పెట్టుకుంటున్నానని పేర్కొంది. ఆ తరువాత ఆమె అకౌంట్ నుంచి వరుసగా వీడియోలు, ఫోటోలు లీక్ కావడంతో, 'నమ్మితే నమ్మండి.. నమ్మకపోతే మానేయండి, నా అకౌంట్ హ్యాకింగ్ కు గురైంద'ని సుచిత్ర ఒకసారి చెప్పింది. అదే సమయంలో ఆమె భర్త తన భార్య మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పడం జరిగింది. ఆమె మాత్రం తాను చేసిన ఆరోపణలను వ్యతిరేకించే కోలీవుడ్ ప్రముఖులెవరైనా బహిరంగ చర్చకు వస్తే తాను సిద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు.