: బంగారం ధర మళ్లీ తగ్గింది!
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు బంగారం ధర మరింత తగ్గి మరోసారి రూ. 30 వేల కిందకు చేరింది. నేటి ట్రేడింగ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 350 తగ్గి, రూ. 29,750కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,231.90 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.92 శాతం తగ్గి... ఔన్స్ 17.18 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తగ్గింది.