: కంగనా రనౌత్ విషయంలో విసిగిపోయా: కరణ్ జొహార్


తన అభిప్రాయాలను ముందూ వెనకా ఆలోచించకుండా, ఉన్నదున్నట్టు వెల్లడిస్తుందంటూ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు పేరు ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జొహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకు వెళ్లిన ఈ అమ్మడు... ఆ షోలోనే కరణ్ పై విమర్శలు గుప్పించింది. బంధుప్రీతిని ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడని, అతనొక మూవీ మాఫియా అని నానా మాటలు అంది. ఆమె వ్యాఖ్యలపై తాజాగా కరణ్ ను ఓ ఇంటర్వ్యూలో మీడియా ప్రశించింది.

దీనికి సమాధానంగా, ఆమె తన షోకు గెస్ట్ గా వచ్చిందని, అందువల్ల ఆమె ఏది చెబితే అది వినాల్సి ఉంటుందని చెప్పాడు. ఎప్పుడూ తనకేదో అన్యాయం జరిగిపోతోందనే విధంగా కంగన బాధపడుతుంటుందని... ఆమె వ్యవహారంతో తాను పూర్తిగా విసిగిపోయానని తెలిపాడు. ప్రతి సందర్భంలోనూ కేవలం ఒక్క వ్యక్తే అన్యాయానికి గురి కావడం ఉండదని చెప్పాడు. సినీ పరిశ్రమ అంత చెడ్డదిగా కనిపిస్తే... వదిలేసి వెళ్లిపోవచ్చని ఓ సలహా కూడా ఇచ్చేశాడు.

  • Loading...

More Telugu News