: అక్కినేని అఖిల్, శ్రియలను కలిపేందుకు యత్నిస్తున్న మెగాస్టార్ కోడలు?


అంతా సవ్యంగా జరిగి ఉంటే హీరో అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ల పెళ్లి మే నెలలో ఇటలీలో ఘనంగా జరిగి ఉండేది. కానీ, వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో, వారి వివాహం రద్దయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వివాహం రద్దు కావడంతో అక్కినేని నాగార్జున కూడా చాలా డిస్టర్బ్ అయ్యారట. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇరు కుటుంబాలు కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. పలు కార్యక్రమాలకు హాజరవుతున్న అక్కినేని అమలను ఈ విషయం గురించి మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ, ఆమె ఏ మాత్రం స్పందించడం లేదు.

ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారం గురించి మరో వార్త వినిపిస్తోంది. అఖిల్, శ్రియల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన యత్నిస్తోందట. జీవీ కృష్ణారెడ్డి కుటుంబంతో ఉపాసన కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. శ్రియకు కూడా ఆమె మంచి స్నేహితురాలు. ఈ క్రమంలో, వీరిద్దరినీ కలిపేందుకు ఉపాసన యత్నిస్తోందట. మరి ఈమె ప్రయత్నాలు ఎంతమేర విజయవంతమవుతాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News