: చిన్నపిల్లాడి మనస్తత్వంతోనే నా ఇంటి ముందు బాలయ్య తొడగొట్టాడు... నేనసలు పట్టించుకోలేదు: పురందేశ్వరి


2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తన ఇంటి ముందుకు వచ్చిన బాలకృష్ణ తొడగొట్టి వెళ్లిన విషయమై ఆయన సోదరి పురందేశ్వరి స్పందించారు. "అది... బాలకృష్ణ గారు గబుక్కున చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని చూపిస్తూ... అతని యాక్షన్స్ ఉంటాయి అన్నది నాకు తెలుసు. ఆ నేపథ్యంలోనే పక్కనున్న వాళ్లు ఎవరో చెప్పారు. వెంటనే ఆయన తొడగొట్టడం జరిగింది. దాన్ని నేను ఎప్పుడూ కూడా తప్పుగా భావించలేదు. అటువంటి పరిస్థితి వస్తే, నా తమ్ముడి చర్యకు నేను నవ్వి ఊరుకుంటానంతే" అని చెప్పారు. తన తమ్ముడితో తనకు ఎన్నడూ విభేదాలు లేవని చెప్పారు. కుటుంబ సభ్యులుగా తామంతా ఒకటేనని, రాజకీయాలు, కుటుంబ బంధాలు వేరువేరని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News