: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి దీపక్ రెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదయింది. బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించడానికి ఆయన ప్రయత్నించారనే ఆరోపణలతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ఆయనకు నోటీసులు జారీ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. అటు అనంతపురంలో కాని, ఇటు హైదరాబాదులో కాని దీపక్ రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో, ఆయనకు నోటీసులు అందించడంలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం.