: రాజకీయ నేతలకు కులపిచ్చి కాదు.. కుర్చీ పిచ్చి ఉంటుంది: వెంకయ్యనాయుడు


రాజకీయ నేతలకు కులపిచ్చి ఉండదని, కుర్చీ పిచ్చి ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. 'గుంటూరు కేసరి' నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు ఆత్మకథ గ్రంథ ఆవిష్కరణ సభను విజయవాడలో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రాజకీయాలకు కావాల్సింది ‘వారసత్వం కాదు జవసత్వం’ అని, కాలాన్ని అనుసరించి మార్చుకోవాల్సింది ఆలోచనలు తప్పా, ప్రజల నమ్మకాలు కాదు అని అన్నారు. స్వేచ్ఛ పేరిట యూనివర్శిటీలు కలుషితమవుతున్నాయని పేర్కొన్న వెంకయ్యనాయుడు, అవినీతికి, అసమానతలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News