kashmir: జమ్మూకశ్మీర్ లో సైనిక శిబిరం వద్ద పేలుడు.. ముగ్గురికి గాయాలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లా సోపోర్ లో ఏర్పాటు చేసిన సైనిక శిబిరం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. అయితే పేలుడుకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియలేదు. ఆదివారం పుల్వామా జిల్లాలోని త్రాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో  హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన కొద్దిసేపటికే ఈ పేలుడు జరిగింది. ఉగ్రవాదులను చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడి ఘటన చోటు చేసుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
kashmir
bombblast
army camp
జమ్మూకశ్మీర్
బాంబు పేలుడు

More Telugu News