: నా తమ్ముడు ఏం చెప్పినా నిజం చెప్పాలి: బాలకృష్ణకు పురందేశ్వరి సలహా


తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయాలని భావిస్తున్న తమ్ముడు బాలకృష్ణ ఆ చిత్రం ద్వారా ఏం చెప్పినా నిజమే చెప్పాలన్నది తన అభిమతమని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. జరిగిన అన్ని సంఘటనలనూ వాస్తవాలను దాయకుండా చెబితే, తాను అభినందిస్తానని, తప్పయినా, ఒప్పయినా బాలకృష్ణ క్లియర్ గా చూపించాలని అన్నారు. న్యూస్ చానల్ టీవీ-9లో 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. వైకాపాలో చేరేది ఎప్పుడన్న ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. ఏ పార్టీలోనైనా గౌరవం ఉన్నంతకాలం మాత్రమే ఉండగలమని అన్నారు. ఈ ఇంటర్వ్యూ నేటి రాత్రి ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News