: వివాహం కాకుండానే ఇద్దరు బిడ్డలకు తండ్రినయ్యాను: ట్విట్టర్ లో కరణ్ జొహార్
తన వ్యక్తిగత రహస్యాలను బయట పెట్టేందుకు వెనుకాడని దర్శక నిర్మాతగా పేరున్న కరణ్ జొహార్, మరో విషయాన్ని తెలిపాడు. తాను పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చానని తెలిపాడు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచుతూ, సరోగసీ విధానంలో ఓ బాబుకు, ఓ పాపకు జన్మనిచ్చినట్టు చెప్పాడు. ముంబై, అంధేరీలోని ఓ ఆసుపత్రిలో జన్మించిన కవలలకు తండ్రి పేరుగా బర్త్ సర్టిఫికెట్ లో తన పేరును రాయించుకున్న కరణ్ ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. తాను అవివాహితుడు కావడంతోనే తల్లి పేరును వెల్లడించడం లేదని తెలిపాడు. కాగా, ఇప్పటికే కరణ్ తన జీవిత చరిత్ర పుస్తకంలో, పిల్లలను దత్తత తీసుకుంటానని అలా కుదరకుంటే, అద్దె గర్భం ద్వారా పిల్లల్ను కంటానని తెలిపిన సంగతి విదితమే. ఇప్పుడు కరణ్ దాన్నే నిజం చేశాడు.