: 'రోహ్ తక్ సిస్టర్స్' కేసులో లభించని సాక్ష్యాలు... నిందితులను వదిలేసిన కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహ్ తక్ సిస్టర్స్ ఆర్తి, పూజా కుమార్ పేర్లు గుర్తున్నాయా? డిసెంబర్ 2014లో తమను బస్సులో వేధించారని ఆరోపిస్తూ, ముగ్గురు యువకులను వీరు ఎదిరించి, కొడుతుంటే, తీసిన ఓ వీడియో వైరల్ గా మారి పెను చర్చకు తెరలేపింది. ఈ కేసులో నిందితులపై ఎటువంటి సాక్ష్యాలూ లభించకపోవడంతో, 27 నెలల తరువాత రోహ్ తక్ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు, నిందితులు కుల్ దీప్, దీపక్, మోహిత్ లకు పాలీగ్రాఫ్ పరీక్షలు చేసి, వారు అబద్ధాలు చెప్పడం లేదని తేల్చి, అదే విషయాన్ని కోర్టుకు నివేదించడంతో, న్యాయమూర్తి వారిని నిర్దోషులుగా నిర్ణయించారు. కుల్ దీప్, ఇప్పటికే ఆర్మీలో చేరాలన్న కోరికతో మెడికల్, ఫిజికల్ టెస్టులు పాస్ కాగా, మిగతా ఇద్దరూ ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పు తమకెంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు.

More Telugu News