: పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి, మహిళా సిబ్బందిని వేధించిన ఆకతాయి అరెస్టు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన లారీ డ్రైవర్ మురళిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మురళి 100 నెంబర్ కు 298 సార్లు ఫోన్ చేశాడని డీసీపీ పాలరాజు తెలిపారు. అలా ఫోన్ చేసిన ప్రతిసారి పోలీసు కంట్రోల్ రూమ్ మహిళా సిబ్బందితో అసభ్యకరంగా మాట్లాడాడని అన్నారు.
డయల్ 100తో పాటు 104, 108 నంబర్లకు కూడా మురళి పదేపదే ఫోన్ చేశాడని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డయల్ 100, 108, 104 నంబర్లకు అనవసరంగా ఫోన్లు చేయవద్దని సూచించారు. ఈ నెంబర్లను ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు ఏర్పాటు చేశామని, అనవసరంగా ఫోన్ చేసి, ఈ నెంబర్లను దుర్వినియోగం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.