: గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ


గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు భేటీ అయ్యారు. త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న‌ బ‌డ్జెట్ స‌మావేశాలు స‌హా ఇత‌ర అంశాల‌పై ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి జరుగనున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశాల‌ను కనీసం 15 పని దినాలకు తక్కువ కాకుండా నిర్వహించాలని స‌ర్కారు యోచిస్తోంది. ఈ నెల 10న తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ నెల 13న రాష్ట్ర‌ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్ట‌నున్నారు.

  • Loading...

More Telugu News