: కవిత, ఈటల రాజేందర్ లు వాళ్ల స్థాయిని గుర్తుంచుకోవాలి: రమణ


టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఖండించారు. ఎంపీ కవిత, మంత్రి ఈటల రాజేందర్ లు తమ స్థాయిని కూడా మరిచి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను, లోటు బడ్జెట్ లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. పేదల పక్షాన టీడీపీ పోరాడుతుందని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ రమణ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News