: హీరో హీరోయిన్ల పర్శనల్ ఫోటోలను లీక్ చేసిన సింగర్ సుచిత్రా కార్తీక్!


కొన్ని రోజుల క్రింతం సినీ నటుడు ధనుష్ తనను గాయపరిచాడంటూ సోషల్ మీడియాలో వాపోయిన కోలీవుడ్ గాయని సుచిత్ర తాజాగా మరో ట్వీట్ తో కలకలం రేపింది. హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్, నటి తాప్సీ, ఆండ్రియా, హన్సిక, బుల్లితెర నటి, వ్యాఖ్యాత డీడీ (దివ్యదర్శిని)ల రాసలీలలంటూ వారి ఫొటోలను తాజాగా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఇవి వైరల్ అయ్యాయి. దీంతో కాసేపటికే మళ్లీ ట్విట్టర్ లో ప్రత్యక్షమైన సుచిత్ర తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని తెలిపింది.

ఎవరో తన అకౌంట్ ను హ్యాక్ చేశారని, ఈసారి హ్యాకర్ తన ఫోటోను కూడా పెట్టాడని పేర్కొంది. దీంతో తాను జాగ్రత్తపడ్డానని, తన అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేరని తెలిపింది. అయితే సుచిత్ర పోస్టు చేసిన చిత్రాలు కోలీవుడ్ లో పెద్ద చర్చను రేపాయి. వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో కోలీవుడ్ నటులు తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

  • Loading...

More Telugu News