: మియాపూర్-ఎస్ఆర్ నగర్ మార్గంలో పరుగులు పెట్టనున్న మెట్రో రైలు


హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం దగ్గర పడుతోంది. నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. మియాపూర్-ఎస్ఆర్ నగర్ మార్గంలో త్వరలోనే మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించనున్నామని మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నాగోల్-బేగంపేట్ మార్గంలో రైలు సర్వీసులను కొన్ని నెలల తర్వాత ప్రారంభిస్తామని చెప్పారు. 2018 నాటికి మెట్రో ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోను పూర్తవుతుందని తెలిపారు. ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని మరో రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తున్నామని చెప్పారు. పాత బస్తీలో మెట్రో పనులకు కొంచెం ఆలస్యమవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News