: కాబోయే శ్రీమతి కోసం ప్రతిరోజూ వంట చేస్తోన్న నాగచైతన్య.. ఫొటో పోస్ట్ చేసిన సమంత!
కొంత కాలంగా అక్కినేని నాగచైతన్య, చెన్నై బ్యూటీ సమంత ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండకపోయినప్పటికీ సమంత మాత్రం తనకు సంబంధించిన పలు విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె నాగచైతన్య వంట చేస్తోన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి, తనని చైతూ ఎంతబాగా చూసుకుంటున్నాడో చెప్పింది. ఆ ఫొటోలో చైతూ గ్యాస్ స్టౌవ్ దగ్గర నిల్చుని బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. చైతూ తన కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసిన తర్వాతే బయటకు వెళ్తాడని సమంత చెప్పింది. ఈ ప్రపంచానికి తానే మహారాణి అనుకునేలా చేసిన దేవుడికి మోకాళ్లపై కూర్చుని అభివాదం చేస్తున్నానని సమంత పేర్కొంది. సమంత చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.