: అమెరికాలో భారతీయుడికి 9 ఏళ్ల జైలు.. క్రెడిట్ కార్డుల మోసం కేసులో కోర్టు తీర్పు
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. క్రెడిట్ కార్డుల్లోని సమాచారాన్ని చోరీ చేసి ఏకంగా 25 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.166.96 కోట్లు)కు పైగా మోసాలకు పాల్పడిన అమిత్ చౌదరి (44)కి 9 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ వర్జీనియా కోర్టు తీర్పు చెప్పింది.
వర్జీనియాలోని యాష్‌బర్న్‌కు చెందిన అమిత్ చౌదరి గతేడాది సెప్టెంబరులో తనపై నమోదైన అభియోగాలను అంగీకరించారు. దీంతో 4.1 మిలియన్ డాలర్లు (27.38 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2011లో అమెరికా పౌరుడిగా మారిన భారత సంతతికి చెందిన అమిత్ క్రెడిట్ కార్డుల్లోని సమాచారాన్ని దొంగిలించి వందలాది నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్‌కు కుట్ర పన్నినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.