: ఏలియన్ లా కనిపించాలని 110 సర్జరీలు చేయించుకున్నాడు!


పుర్రెకోబుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్ ‌కు చెందిన విన్నీ ఓహ్ (22) గురించి తెలుసుకుంటే పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకువస్తాయి. మేకప్‌ ఆర్టిస్ట్‌గా, పార్ట్‌ టైం మోడల్‌గా పనిచేసే విన్నీ ఓహ్ పుర్రె ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే, ఓ ‘గ్రహాంతర వాసి’గా కనిపించాలని తాపత్రాయపడ్డాడు. ఆ రూపు కోసం సుమారు 110 సార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. అందుకోసం సుమారు 34 లక్షల రూపాయలు (50 వేల డాలర్లు) ఖర్చు చేశాడు.

17వ ఏట నుంచే తాను స్త్రీ లేదా పురుషుడుని కాదని, ఓ గ్రహాంతర వాసినని అతను భావిస్తున్నాడు. గ్రహాంతర వాసిలా కనిపించేందుకు నల్లని (ముదురు నలుపు) కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకుంటాడు. ఒళ్లంతా గ్రహంతర వాసుల టాటూలు వేసుకుంటాడు. వెంట్రుకలకు అసాధారణ రంగులు వేసుకుంటాడు. అంతే కాకుండా తనను స్త్రీ లేదా పురుషుడిగా గుర్తించకుండా ఉండేందుకు పురుషాంగం, నాభి, ఛాతి భాగాలను పూర్తిగా తొలగించుకోవాలనుకుంటున్నాడట. దీనికి గాను కోటి రూపాయలు (1,60,000 డాలర్లు) ఖర్చు అవుతుందట.

  • Loading...

More Telugu News