: ఆ నటికి సరిగ్గా రెమ్యూనరేషన్ ఇవ్వరని చెప్పిన సోనమ్ కపూర్!


ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ‘అనార్కలి ఆఫ్ ఆరా’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నటి స్వర భాస్కర్ గురించి సోనమ్ ప్రస్తావించింది. కొన్ని వారాల క్రితమే ఈ సినిమా చూశానని, స్వర నటన అద్భుతంగా ఉందని, ఆమె నటన తనను కదిలించి వేసిందని చెప్పింది. అయితే, అంత మంచి నటి అయిన స్వరకు రెమ్యూనరేషన్ సరిగ్గా ఇవ్వరని సోనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని మంచి చిత్రాల్లో స్వర నటించాలని తాను కోరుకుంటున్నానని చెప్పింది. కాగా, సోనమ్, స్వర భాస్కర్ మంచి మిత్రులు. రాం ఝానా, ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాల్లో వీరు కలిసి నటించారు. తాజాగా, ‘వీరే ది వెడ్డింగ్’లో వీళ్లిద్దరూ మరోసారి కలిసి నటిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News