: స్మిత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఆడినంత చెత్త ఆటను మరెప్పుడూ ఆడబోమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తొలి టెస్టులో ఓటమిని అంగీకరించాల్సిందేనని... ఆస్ట్రేలియా తమకంటే బాగా ఆడిందని చెప్పాడు. తొలి టెస్టులో ఓడిన ఇండియా ఒత్తిడిలో ఉందంటూ ఆసీస్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ తిప్పికొట్టాడు. స్మిత్ వ్యాఖ్యలు ఓ మైండ్ గేమ్ అని చెప్పాడు. తాము ఎలాంటి ఒత్తిడిలో లేమని... హ్యాపీగానే ఉన్నామని చెప్పాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఏమనుకున్నా తమకు అనవసరమని... తాము మాత్రం రెండో టెస్టుకు సన్నద్ధమవడంపై దృష్టి సారించామని తెలిపాడు.