: గీత దాటుతున్నారు...తోకలు కట్ చేయాలి: పాల్వాయి సంచలన వ్యాఖ్యలు
పార్టీలో కొంత మంది నేతలు గీత దాటుతున్నారని, వారి తోకలు కట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ సీనియర్ నేతలుగా పేరొందిన కొందరు నేతలు హద్దులు మీరి పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై తాను ఏకే ఆంటోనీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. కేవలం నల్గొండ జిల్లాకు చెందిన నేతలు మాత్రమే ఇలా హైకమాండ్ ను కూడా లెక్క చేయకుండా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత దిగ్విజయ్ సింగ్ దేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రాపోలు ఆనంద్ భాస్కర్, ఎంఏ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యలు గైర్హాజరు కావడం గమనార్హం.