: నారా లోకేష్ కు లైన్ క్లియర్... 6న నామినేషన్
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నెల 6వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నేటితో ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ దృష్టి సారించింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 7వ తేదీ చివరి తేదీ. అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం ప్రకారం టీడీపీకి 5, వైసీపీకి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించనుంది. వైకాపా ఇప్పటికే తన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది.