: రోజాకు మహిళలే బుద్ధి చెబుతారు: ప్రభుత్వ విప్ యామినీ బాల

ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ తరహా వ్యాఖ్యలకు ఆమె స్వస్తి చెప్పకపోతే మహిళలే ఆమెకు బుద్ధి చెబుతారని ప్రభుత్వ విప్ యామినీ బాల మండిపడ్డారు. అనంతపురంలో మీడియాతో ఈ రోజు ఆమె మాట్లాడుతూ, చట్టం, చట్ట సభలపై రోజాకు ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని వైఎస్సార్సీపీ రాజకీయం చేస్తోందని, జిల్లా కలెక్టర్, ఆసుపత్రి వైద్యులను జగన్ తోసివేయడం ఎంత వరకు సబబు? అని ఆమె ప్రశ్నించారు. రౌడీయిజం, గూండాయిజం చేసి గుర్తింపు పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదని, ప్రతిపక్ష నేత జగన్ ను చూసి ప్రభుత్వం భయపడుతోందని రోజా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

More Telugu News