: సర్వీసు రివాల్వర్‌తో భార్యను కాల్చి చంపి.. తానూ కాల్చుకున్న ఎస్సై
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఈ రోజు ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాకలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోన్న చిట్టిబాబు అనే వ్యక్తి తన భార్యను తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చాడు. అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో చిట్టిబాబు భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సదరు ఎస్సై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై ఈ ఘటనకు పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.