: బస్సులోనే ప్రాణాలు కోల్పోయిన ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్
బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆ బస్సులోనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ వద్ద చోటుచేసుకుంది. బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ రసూల్ రోజూలాగే ఈ రోజు కూడా కళాశాలకు బస్సును తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో బస్సులో డీజిల్ అయిపోవడంతో రోడ్డు పక్కకు ఆపాడు. అయితే, అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా స్టీరింగ్‌పైన పడిపోయి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన బస్సులో ఉన్న విద్యార్థులు తమ కాలేజీ యాజమాన్యానికి ఈ సమాచారం అందించారు.