: చిరుతపై గ్రామ సింహాల దాడి... పలాయనం!


దారి తప్పి ముంబై మహానగరంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులిని వీధి కుక్కలు వెంటబడి తరిమిన ఘటన సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ముంబై శివారు ప్రాంతంలోని గోరేగావ్ పరిధిలోని నివాస ప్రాంతంలోకి ఓ చిరుత చొరబడగా, దాన్ని చూసిన కొన్ని కుక్కలు, చిరుతపై యుద్ధం ప్రకటించాయి. దాని వెంటబడి తరిమాయి. ఓ అపార్టు మెంటు ప్రాంతంలోకి చిరుత రాగా, కుక్కలు దాన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. సాధారణంగా చిరుతను చూస్తే శునకాలు పారిపోతాయి. ఇక్కడ మాత్రం చిరుతకు చుక్కెదురైంది. ఆ గ్రామ సింహాల ధాటికి తట్టుకోలేక చిరుత పలాయనం చిత్తగించగా, ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News