: ఏపీ ప్రైవేటు బస్సులపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం.. హైదరాబాదు శివారులో చెకింగులు !
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సులపై తెలంగాణ ఆర్టీయే అధికారులు ఉక్కుపాదం మోపారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సులను శివారు ప్రాంతాల్లోనే అడ్డుకుని వాటి పర్మిట్ లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మొత్తం 19 బస్సులకు సరైన దస్త్రాలు లేవని గుర్తించి వాటిపై కేసులను నమోదు చేశారు. శంషాబాద్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పలు ప్రముఖ ట్రావెల్స్ కు చెందిన బస్సులపై కేసులు నమోదైనట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం వెలువడాల్సివుంది.