: 'గౌతమీపుత్ర శాతకర్ణి' 50 రోజుల పండగలో అపశ్రుతి!

నెల్లూరు జిల్లాలో బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' అర్ధ శతదినోత్సవ వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ఇక్కడి నర్తకి థియేటరులో బాలకృష్ణ అభిమానులు ఈ తెల్లవారుజాము నుంచి సందడి చేయడం ప్రారంభించారు. తమ హీరో చిత్రం 50 రోజుల పండగను ఘనంగా జరుపుకోవాలన్న వారి ఉత్సాహం శ్రుతిమించింది. భారీ ఎత్తున బాణసంచా కాల్చడంతో, పక్కనే ఉన్న ఆయిల్ గోడౌన్, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఘటన వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News