: రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ అనుమతి
జియోతో టెలికాం రంగంలో ఊహించని విధంగా యూజర్లను సొంతం చేసుకున్న రిలయన్స్.. తాజాగా పేమెంట్ బ్యాంకును తీసుకురావడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. పాతనోట్ల రద్దు అనంతరం ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన క్రమంలో సంప్రదాయ బ్యాంకులకు దీటుగా వివిధ పేమెంట్ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే ఈ రంగంలోకి ఎయిర్‌టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్‌లు ప్రవేశించాయి. ఎస్‌బీఐ భాగస్వామ్యంతో ఈ నెల 31లోపు ఈ సర్వీసులను ప్రారంభించాలని జియో చూస్తోంది. జియోను మరింత లాభాల దిశగా పయనించేలా తమ పేమెంట్స్ బ్యాంకు సహకరిస్తుందని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.