: ఆహ్వానాలు పంపకపోయినా కనీసం ఫోన్లకు మెసేజ్ లు పెట్టినా వచ్చేవాళ్లం!: చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఆన్సర్
అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నేతలు రాకపోవడం దురదృష్టకరమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించకపోగా... మళ్లీ తమపైనే విమర్శలు గుప్పించడం దారుణమని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.
తమకు ఆహ్వానాలు పంపకపోయినా... కనీసం ఫోన్లకు మెసేజ్ లు పెట్టినా వచ్చేవాళ్లమని వైకాపా నేతలు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభోత్సవాన్ని సొంతింటి పండుగలా, టీడీపీ అధికార కార్యక్రమంలా నిర్వహించారని వారు మండిపడ్డారు.