: అసెంబ్లీలో కూర్చుని చంద్రబాబు ఇచ్చిన తొలి ఆదేశాలు!
ఈ ఉదయం వెలగపూడిలో అసెంబ్లీ భవనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడు, తొలి ఆదేశాల దస్త్రంపై సంతకం చేశారు. అసెంబ్లీ సభ్యులకు అమరావతి ప్రాంతంలో ఎలాంటి క్వార్టర్స్ లేనందున రూ. 50 వేల అదనపు భత్యం ఇచ్చేందుకు ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలపై బాబు సంతకం చేశారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని తన స్థానంలో ఆసీనుడైన ఆయన, సభ బాగుందని, నిర్మాణం, ఏర్పాట్లు సంతృప్తిని కలిగించాయని అన్నారు. సీట్ల ఏర్పాటు సౌకర్యవంతంగా ఉందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధ్వని వ్యవస్థ ఇక్కడుందని అన్నారు.