: ఉత్తరం రాస్తే, గిఫ్ట్ గా సైకిల్ వచ్చింది... జగిత్యాల చిన్నారి మోమున చిరునవ్వు!

తన చుట్టుపక్కల పిల్లలంతా సైకిల్ పై వెళుతున్నారని, తనకూ సైకిల్ తొక్కాలని కోరికగా ఉందని, జగిత్యాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ మహిళా పారిశ్రామికవేత్తకు లేఖ రాయగా, ఆమె వెంటనే స్పందించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, జగిత్యాలలో చిరు వ్యాపారిగా ఉన్న ప్రసాద్ కుమార్తె మనస్విని. ఆ పాపకు సైకిల్ తొక్కాలన్న కోరిక ఉన్నప్పటికీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అది తీరలేదు. ఇక, హైదరాబాద్ కు చెందిన ఎంఈఐఎల్ సంస్థ ఎండీ సుధారెడ్డి ఎంతో మందికి సాయం చేశారని తెలుసుకున్న మనస్విని, తన మనసులోని కోరికను తెలుపుతూ లేఖ రాసింది. ఫిబ్రవరి 28న తన పుట్టిన రోజుని పేర్కొంది. ఈ లేఖకు స్పందించిన సుధారెడ్డి, వెంటనే పాపను హైదరాబాద్ పిలిపించుకుని, తన ఇంట్లోనే జన్మదిన వేడుక నిర్వహించి, ఓ ఖరీదైన సైకిల్ ను పాపకు బహుమతిగా ఇచ్చింది. కొత్త సైకిల్ ను చూసిన మనస్విని మోమున చిరునవ్వు వెలిసింది.

More Telugu News