: జగన్ కు పడేది యావజ్జీవమే!: మంత్రి ప్రత్తిపాటి
వైకాపా అధినేత వైఎస్ జగన్ కు యావజ్జీవ జైలు శిక్ష ఖాయమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఆయనకు కల్లో కూడా జైలే కనిపిస్తోందని, అందువల్లే తనకు ఎదురైన ప్రతి ఒక్కరినీ జైలుకు పంపుతానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన తప్పులకు కోర్టులు జీవితకాల శిక్షను విధించనున్నాయని అన్నారు. తమిళనాడులో శశికళకు పట్టినగతే ఏపీలో జగన్ కూ పట్టనుందని హెచ్చరించారు. పిడుగురాళ్లలో మీడియాతో మాట్లాడిన ఆయన, గుంటూరు జిల్లాకు చంద్రబాబు ఎంతో చేస్తున్నారని, అన్ని సీట్లనూ గెలిచి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.