: జైట్లీపై కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను కొట్టి వేసిన ఢిల్లీ హైకోర్టు
గతంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్‌జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై జైట్లీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వెనక్కు తగ్గని కేజ్రీవాల్ తాజాగా అరుణ్‌జైట్లీకి సంబంధించిన బ్యాంకు అకౌంటు, పన్ను రిటర్న్స్, ఇతర ఆర్థికపరమైన పత్రాలను పరిశీలించేందుకు అనుమతి మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. అరుణ్‌జైట్లీపై దురుద్దేశంతో వేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి రాజీవ్ సహాయ్ ఎండ్లా పేర్కొన్నారు.