: భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది!


న‌ల్గొండ జిల్లాలో హృద‌య‌విదార‌క‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి గత నెల 26న నల్గొండలో బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ విషాద‌వార్త‌ను అత‌డి భార్య హేమలతకు చెప్ప‌లేదు. దానికి కార‌ణం ఆమె నిండు గర్భిణి కావడమే. అయితే, పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన అనంత‌రం ఆ వార్త‌ను ఆమెకు తెలిపారు ఆమె కుటుంబ స‌భ్యులు. కానీ, ఆమె గుండె ఆ వార్త‌ను విని త‌ట్టుకోలేక‌పోయింది. రోదిస్తూ కుప్పకూలిపోయి మృతి చెందింది. సురేష్‌, హేమ‌ల‌త‌ల‌కు అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు మ‌రో కుమార్తె కూడా ఉంది. హేమలత మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామానికి తరలించి అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు.

  • Loading...

More Telugu News