: చిన్న పిల్లాడిలా ప్ర‌సంగాన్ని బ‌ట్టీ ప‌ట్టిన డొనాల్డ్ ట్రంప్‌.. నవ్వు పుట్టిస్తోన్న ట్రంప్ వీడియో


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి ప్ర‌సంగం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, అంత‌కు ముందు ఆయ‌న ఏమి చేశారో తెలుసా? ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న చిన్నారులు ఏ విధంగా పాఠాల‌ను బ‌ట్టీ పడ‌తారో అదే విధంగా ట్రంప్ త‌న ప్ర‌సంగాన్ని ఓ పేప‌రులో చ‌దువుకుంటూ బ‌ట్టీపట్టారు. చిన్న పిల్లాడి కంటే అన్యాయంగా హావ‌భావాలు ప్ర‌ద‌ర్శిస్తూ ట్రంప్ ఆ ప్ర‌సంగ పాఠాన్ని బ‌ట్టీ పట్టిన‌ట్లు ఆ వీడియోలో క‌న‌బడుతోంది. త‌న లిమోజ‌ర్‌ కారులో కూర్చొని ఆ ప్ర‌సంగ పాఠాన్ని ఆయ‌న చ‌దువుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ నెటిజ‌న్లను తెగ న‌వ్వించేస్తోంది. ఇదిప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప‌లువురు ట్రంప్‌ లిప్ రీడింగుని బ‌ట్టి ఏం చ‌దువుకున్నారో తెలుపుతూ ట్వీట్లు చేస్తూ నవ్వు పుట్టిస్తున్నారు.


  • Loading...

More Telugu News