: రెడ్ మీ బ్లాక్... ఇలా వచ్చింది... అలా ఎగరేసుకుపోయారు!


ఈ సంవత్సరం జనవరిలో తొలిసారిగా మార్కెట్లోకి విడుదలై కేవలం పది నిమిషాల్లో 2.5 లక్షల ఫోన్ల విక్రయాలు సాధించిన రెడ్ మీ నోట్ 4 వేరియంట్ లో బ్లాక్ వర్షన్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు 'ఎంఐ.కామ్' ద్వారా విడుదల కాగా, హాట్ కేకుగా మారింది. అందుబాటులో ఉంచిన ఫోన్లన్నీ బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఎన్ని ఫోన్లను విక్రయానికి ఉంచామన్న విషయాన్ని రెడ్ మీ వెల్లడించకపోయినా, 2 జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ వేరియంట్లలో 32 జీబీ, 64 జీబీ అంతర్గత మెమొరీతో లభించే వీటి ధరలు రూ. 9,999, రూ. 10,999, రూ. 12,999 ధరలుగా సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ఫోన్ లో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌ డ్ గ్లాస్ డిస్‌ ప్లే, 2 జీహెచ్ ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగన్ 625 ప్రాసెసర్, 128 జీబీ వరకూ పెంచుకోతగిన మెమొరీ సామర్థ్యం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 13/5 ఎంపీ కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, ఇన్‌ ఫ్రారెడ్ సెన్సార్, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ సౌకర్యాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News