: అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయ ఆఫర్


తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్ వినియోగదారులకు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్ ను ప్రకటించింది. 'దిల్ ఖోల్ కే బోల్' పేరిట రూ.799 నెలసరి చెల్లింపుతో అపరిమిత వాయిస్ కాల్స్ అందుకోవచ్చని, ఆపై 6 గిగాబైట్ల ఉచిత డేటాను అందిస్తామని తెలిపారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి తొలి నాలుగు నెలలూ 6 జీబీ డేటాను, ఆపై నెలకు 3 జీబీ డేటాను అందిస్తామని అన్నారు. అధిక డేటా కావాలని కోరుకునే వారికోసం రూ. 1125తో 10 జీబీ, రూ. 1525తో 30 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు సంస్థ తెలంగాణ సర్కిల్ సీజీఎం అనంతరామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1503, 18001801503 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News