: డీఎంకేలో చేరిన ప్రముఖ సినీ నటుడు రాధారవి


ప్రముఖ తమిళ సినీ నటుడు రాధారవి డీఎంకే పార్టీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాధారవి మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ పని అయిపోయినట్టే అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ కనుమరుగు అవుతుందని అన్నారు. తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అది కేవలం డీఎంకేతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమర్థుడైన నాయకుడు స్టాలిన్ మాత్రమే అని కితాబిచ్చారు. కాగా, రాధారవి ప్రముఖ నటుడు దివంగత ఎం.ఆర్. రాధాకు తనయుడు, ప్రముఖ నటి రాధికకు సవతి సోదరుడు అవుతాడు.     

  • Loading...

More Telugu News