: సైఫ్-కరీనాల ముద్దుల కొడుకు మరో పేరు ఇదే!
బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల కుమారుడికి తైమూర్ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే 2016 డిసెంబర్ 20న ఈ చిన్నారి పుట్టగానే దేశ వ్యాప్తంగా చర్చను లేవదీశాడు. దీనికి కారణం అతని పేరే. భారత్ పై దండయాత్ర చేసి, భారీ విధ్వంసం సృష్టించిన తైమూర్ పేరును ఎలా పెడతారని సోషల్ మీడయాలో విమర్శల వర్షం కురిసింది.
ఈ నేపథ్యంలో, ఒకానొక సమయంలో తైమూర్ పేరును మార్చడానికి సైఫ్ సిద్ధమయ్యాడట. కానీ, కరీనా వ్యతిరేకించిందట. ఎవరో మెచ్చుకుంటారనో లేదా ఎవరో విమర్శిస్తారనో పేరును పెట్టలేదని... పేరు మార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పిందట. దీంతో, సైఫ్ సైలెంట్ అయిపోయాడట.
ఇప్పుడు తైమూర్ అనే పిలుపును కాస్త పక్కన పెట్టి... తన గారాలపట్టికి ముద్దుపేరు పెట్టింది కరీనా. తన కొడుకుని 'లిటిల్ జాన్' అని పిలుచుకుంటోందట.