: సాగర్ కుడి కాలువకు నీటిని నిలిపిన తెలంగాణ అధికారులు
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీటిని, వేలాది గ్రామాలకు వేసవిలో తాగు నీటిని అందించే నాగార్జున సాగర్ కుడికాలువకు తెలంగాణ అధికారులు నీటిని నిలిపివేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపక్క సాగర్ లో నీరు అడుగంటి పోగా, మరోపక్క తమకు రావాల్సినంత వాటాను ఏపీ ఇప్పటికే వాడుకుందని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తుండగా, ఏపీకి 15.2 టీఎంసీల నీరు రావాల్సివుండగా, ఇప్పటివరకూ 13.2 నీటిని మాత్రమే ఇచ్చారని ఏపీ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 2 టీఎంసీల నీటిని ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, ఈ వేసవిలో ఎన్నో గ్రామాల్లో తాగు నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసుకున్న చెరువులను నీటితో నింపాల్సిన సమయంలో కుడి కాలువకు నీటి విడుదల నిలపడం తగదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.