: 20 ఏళ్ల వరకు అన్నమే తినని టీడీపీ ఎమ్మెల్యే!
భీమవరం టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఆయన అన్నమే తినలేదట. కేవలం పాలు మాత్రమే తాగేవారట. 20 ఏళ్ల వయసులో తనకు పెళ్లయిందని... అప్పట్నుంచే అన్నం తినడం మొదలు పెట్టానని ఆయన చెప్పారు. పాలలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయని... ఈ కారణం వల్లనే తాను అన్నం తినకపోయినా, ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటికీ తాను తక్కువ మోతాదులోనే అన్నం తింటానని... ఎక్కువగా స్నాక్స్, పాలు తీసుకుంటానని చెప్పారు.
2014 జూన్ లో అసెంబ్లీలోనే రామాంజనేయులు కుప్పకూలిపోయారు. ఆయన ఆహారపుటలవాట్ల వల్లే ఇది జరిగి ఉంటుందని ఆయన సన్నిహితులు కొందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వయసు 52 సంవత్సరాలు.
2014 జూన్ లో అసెంబ్లీలోనే రామాంజనేయులు కుప్పకూలిపోయారు. ఆయన ఆహారపుటలవాట్ల వల్లే ఇది జరిగి ఉంటుందని ఆయన సన్నిహితులు కొందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వయసు 52 సంవత్సరాలు.